breaking news
Quetta city
-
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. పెరుగుతున్న మృతుల సంఖ్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ పారామిలటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజీల్లో రోడ్డుపై ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.భారీ పేలుడు ధాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్లు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.పాక్ మీడియా కథనం ప్రకారం..పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం క్వెట్టా జర్ఘున్ రోడ్లో పాకిస్థాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడి అనంతరం కాల్పులు సైతం వినిపించాయి.ఈ ఘటనపై బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలో పదిమందికిపైగా మరణించారని ధృవీకరించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ⚡️🇵🇰 Suicide Bomb Blast in Balochistan's Capital Reportedly Targets Paramilitary Security Force - CCTV 📹 The powerful blast was followed by gunfire in Quetta, near the HQ of the Frontier Corps.The explosion, which appeared to target a vehicle, shattered windows and damaged… pic.twitter.com/GUueo7NXBb— RT_India (@RT_India_news) September 30, 2025 -
పాక్ పక్కలో బల్లెం బలూచిస్తాన్
ఇస్లామాబాద్: భారత సైనికదళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు నైరుతి ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలూచిస్తాన్ తిరుగుబాటుదార్లు అదనుచూసి మరీ పాక్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సరైన సమయమన్న భావన వారిలో కనిపిస్తోంది. తూర్పున భారత్, పశ్చిమాన బలూచిస్తాన్ రెబల్స్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. గురువారం రాత్రి భారత్‌పై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించడంలో తీరికలేకుండా ఉన్న పాకిస్తాన్ సైన్యం మరోవైపు నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడంలో విఫలమైంది. బలూచ్ ఫైటర్లు పాక్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ దాడుల్లో ఏకంగా 16 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలిసింది. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పలు కీలక ప్రాంతాలను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాకిస్తాన్ జాతీయ జెండాలను తొలగించి, తమ జెండాలు ఎగురవేసి పాక్ సార్వభౌమత్వానికి సవాలు విసిరారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా సైతం తిరుగుబాటుదార్ల అ«దీనంలోకి వచ్చినట్లు సమాచారం. ‘‘పాకిస్తాన్‌కు వీడ్కో లు, కొత్త దేశం బలూచిస్తాన్‌కు స్వాగతం’’అంటూ స్థానిక రచయిత మీర్ యార్ బలూచ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కొత్తగా అవతరించిన బలూచిస్తాన్‌లో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు ఉధృతం స్వతంత్ర బలూచిస్తాన్ దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. పాకిస్తాన్ నుంచి విడిపోతామన్న డిమాండ్లు నానాటికీ బలం పుంజుకుంటున్నాయి. ప్రజా ఉద్యమాలను పాక్ సైన్యం కర్కశంగా అణచివేస్తోంది. ఇప్పటికే ఎన్నో తిరుగుబాటు గ్రూప్‌లు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం కావడం బలూచిస్తాన్ రెబల్స్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. గురువారం పలు తిరుగుబాటు గ్రూప్‌లు ఉమ్మడిగా పాక్ సైన్యంతో తలపడ్డాయి. సైన్యానికి సంబంధించిన ఆస్తులు, మౌలిక సదుపాయాలపైనా దాడులకు దిగాయి. రెబల్స్ శుక్రవారం క్వెట్టాలోని ఫైజాబాద్ ప్రాంతంలో పాక్ సైన్యంపై దాడులకు పాల్పడ్డారు. సిబ్బీ మిలటరీ క్యాంపుపై హ్యాండ్ గ్రనేడ్ ప్రయోగించారు. బుధవారం బలూచిస్తాన్‌లో గ్యాస్ పైపులైన్లు, ఇంధన నిల్వలపై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. -
పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్‌ను టార్గెట్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని క్వెట్టా నుండి టఫ్తాన్‌కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #UPDATE The Baloch Liberation Army has claimed that its "self-sacrificing" squad, the Majeed Brigade, carried out a "Fidayee" attack on a #Pakistan Army convoy consisting of 8 buses in #Noshki.#balochistan #quetta #islamabad #Baloch https://t.co/M5Qczo5bAB pic.twitter.com/LM81CJR69Y— Shekhar Pujari (@ShekharPujari2) March 16, 2025 BREAKING!! 🚨‼️‼️At least 10 #PakistaniSoldiers Killed, 26 Injured in Noshki Ambush when a Frontier Corps (FC) bus was attacked on the N-40 highway in Noshki, #Balochistan. It came under attack while moving from Quetta to Taftan,Baluchistan.#Balochistanattack pic.twitter.com/kJDLQxD8QN— सदप्रयास (@sadprayas) March 16, 2025 -
ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో హింస
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 38 మంది మృతి
మృతుల్లో డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ సహా ఎక్కువ మంది పోలీసులే ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మొహిబుల్లా అనే పోలీసు అధికారి అం త్యక్రియల కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి లో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సహా 38 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మరణించినవారిలో ఎక్కువ మంది పోలీసు సిబ్బంది, చిన్నారులే. అయితే.. మొహిబుల్లాను కూడా గురువారం ఉదయమే గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుకాగా.. ఆత్మాహుతి దాడి జరిగింది. మళ్లీ దాడి జరగవచ్చనే భయంతో.. క్షతగాత్రులను సాధారణ ఆస్పత్రికి కాకుండా మిలటరీ ఆస్పత్రికి తరలించారు.