కెనడా హిందీ సినిమా హాళ్లలో కలకలం | Sakshi
Sakshi News home page

కెనడా హిందీ సినిమా హాళ్లలో కలకలం

Published Fri, Dec 8 2023 6:26 AM

Masked men spray unknown substance in theatres showing Indian films - Sakshi

టొరంటో: కెనడాలోని గ్రేటర్‌ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలను ప్రదర్శించే మూడు వేర్వేరు సినిమా హాళ్లలో కలకలం రేగింది. మాస్క్‌ ధరించిన వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. యార్క్‌లోని వౌఘన్‌ సినిమా కాంప్లెక్స్‌లో మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సమయంలో థియేటర్‌లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకుల్లో కొందరు దగ్గడం ప్రారంభించారు.

శ్వాసలో ఇబ్బందికి గురయ్యారు. పోలీసులొచ్చేసరికే అనుమానితులు పరారయ్యారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలోనే ఇలాంటి ఘటనలే జరిగినట్లు పీల్, టొరంటోల్లోనూ జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. స్కార్‌బరో టౌన్‌ సెంటర్‌లోని థియేటర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దుర్వాసన వెదజల్లే బాంబును అమర్చినట్లు తమకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని చెప్పారు.

 
Advertisement
 
Advertisement