కుమారుని డీఎన్‌ఏ టెస్టులో ‘జన్మరహస్యం’... తల్లి చేసిన పని ఇదే..

man took dna test shocked to see results - Sakshi

డిఎన్‌ఏ పరీక్షల తరువాత ఆ యువకునికి ఒక రహస్యం తెలియడంతో అతను హడలిపోయాడు. అతని తల్లి కూడా ఈ విషయాన్ని అతనికి తెలియకుండా దాచిపెట్టింది. డీఎన్‌ఏ టెస్టు అనంతరం అతనికి 35 మంది అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని తెలిసింది. దీంతో అతను తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకు ఈ విషయం ఎందుకు ఎప్పుడూ చెప్పలేదని నిలదీశాడు.

అమెరికాకు చెందిన ఆ యువకుడు తన ఆవేదనను ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలో షేర్‌ చేశాడు..‘ఇది నన్ను పెంచిన తండ్రికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి.ఈ విషయం అతనికి ఇప్పటివరకూ తెలియదు. నాకు నా బయోలాజికల్‌ తండ్రిపై ఎటువంటి ఆపేక్షా లేదు. నన్ను పెంచిపోషించిన తండ్రిపైననే నాకు ప్రేమ ఉందని అన్నాడు. కాగా డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించిన తరువాత అతనికి తన బయోలాజికల్‌ తండ్రితో పాటు 35 మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల ఆచూకీ తెలిసింది.

కాగా అతని తల్లి గర్భందాల్చేందుకు డోనర్‌ స్పెర్మ్‌ వినియోగించింది. ఈ విషయం నా సవతి సోదరసోదీమణులకు తెలిస్తే వారు ఎంతో సంతోషిస్తారనుకుంటున్నాను అని తెలిపిన ఆ యువకుడు తన ఇతర తోబుట్టువులను, డోనర్‌ను కలుసుకున్నాడు. వారంతా ఆన్‌లైన్‌ మాధ్యమంలో కలుసుకుని చాట్‌ చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టు చూసినవాంతా దీనిపై రకకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.

ఒక యూజర్‌ ‘ఇది ఎంతో ఆసక్తికరం. స్పెర్మ్‌ డొనేషన్‌, డీఎన్‌ఏ టెస్టుల విషయంలో ఎంతో ఆలోచించాల్సి వస్తోందని’ పేర్కొన్నాడు. మరొక యూజర్‌ ‘నా ఉద్దేశంలో ఏ విషయాన్నయినా రహస్యంగా ఉంచడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. ఈ కారణంగానే డొనేషన్‌ చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది’ అని అన్నాడు. మరో యూజర్‌ ‘ఇది ఎంతో విచిత్రంగా ఉంది. ఏకంగా 35 మంది తోబుట్టువులంటే నమ్మేలా లేదన్నాడు.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top