క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు

Khalistani Terrorist Pannun Threatens To Shut Down World Cup final - Sakshi

అహ్మదాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా ప్రశ్నించాడు.

అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్‌ ఫర్ జస్టిస్ సంస్థకు  గురుపత్వంత్ సింగ్ నాయకునిగా ఉన్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఈయన హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై హెచ్చరికలు చేస్తూ గత నెలలో కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు.  సెప్టెంబరులో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కూడా పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పోత్రహించే చర్యలకు పాల్పడినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది.

అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.  ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవనున్నారు.  

ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top