కమలా హారిస్‌ మరో రికార్డు.. అమెరికా చరిత్రలో 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..

Kamala Harris Makes History With Tie Breaking Votes In Senate - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్‌(58) మరో రికార్డు నెలకొల్పారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ను అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్‌ సభ్యురాలిగా నియమించే విషయంలో ఆమె టై–బ్రేకింగ్‌ ఓటు వేశారు.

సెనేట్‌లో బుధవారం ఓటింగ్‌ జరిగింది. కల్పనా కోటగల్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ టై–బ్రేకింగ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకోవడం 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 
చదవండి: రెస్టారెంట్‌కు షాక్‌.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top