కరోనా తొలిసారిగా సోకింది ఆమెకే.. | Journal Science Identified First Covid Victim | Sakshi
Sakshi News home page

కరోనా తొలిసారిగా సోకింది ఆమెకే..

Nov 20 2021 1:09 AM | Updated on Nov 20 2021 8:46 AM

Journal Science Identified First Covid Victim - Sakshi

బీజింగ్‌: చైనాలోని వూహాన్‌ మార్కెట్‌లో సీఫుడ్‌ అమ్మే ఒక మహిళ కరోనా వైరస్‌ సోకిన మొట్ట మొదటి వ్యక్తి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వూహాన్‌కి దూరంగా నివసించే ఒక అకౌంటెంట్‌ కోవిడ్‌–19 తొలి రోగి అని ఇన్నాళ్లు భావిస్తున్నది తప్పని జర్నల్‌ సైన్స్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్‌ మూలాలు కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) చేసిన విచారణ కూడా తప్పుదారిలోనే నడిచిందని అభిప్రాయపడింది. వూహాన్‌లోని మాంసం అమ్మే హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌లో మహిళే మొట్టమొదటి కరోనా రోగి అని ఆ అధ్యయనం తేల్చింది. 2019 డిసెంబర్‌ 11న సీఫుడ్‌ అమ్మే ఒక మహిళలో లక్షణాలు బయటపడ్డాయని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement