పెరుగుతున్న కోవిడ్‌ కేసులు | covid-19 cases increase in andhra pradesh | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

Jul 20 2026 4:04 AM | Updated on Jul 20 2026 4:04 AM

covid-19 cases increase in andhra pradesh

ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్‌)/గుంటూరు మెడికల్‌: రాష్ట్రంలో మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఒక కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడిని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్‌ కోవిడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 అతడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. అదేవిధంగా ఆదివారం బాపట్ల జిల్లా కర్లపాలేనికి చెందిన ఓ వ్యక్తికి చేసిన పరీక్షలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. బాధితుడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement