ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు

Israeli Tourists Shot Dead By Egyptian Cop Amid Israel Palestine Conflict - Sakshi

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.

ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top