Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం | Israel-Hamas war: Israeli strikes kill at least 42 in Gaza | Sakshi
Sakshi News home page

Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం

Jun 23 2024 6:26 AM | Updated on Jun 23 2024 6:26 AM

Israel-Hamas war: Israeli strikes kill at least 42 in Gaza

ఖాన్‌ యూనిస్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి.

 పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్‌ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement