2.45 బిలియన్‌ డాలర్లతో గాజా పునర్మిర్మాణం | Trump Board of Peace unveils 2. 45billion dollars plan to begin Gaza reconstruction | Sakshi
Sakshi News home page

2.45 బిలియన్‌ డాలర్లతో గాజా పునర్మిర్మాణం

Sep 24 2026 6:38 AM | Updated on Sep 24 2026 6:38 AM

Trump Board of Peace unveils 2. 45billion dollars plan to begin Gaza reconstruction

అమెరికా మద్దతున్న ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ ప్రతిపాదన

న్యూయార్క్‌: గాజాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రణాళిక అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాడులు ఆగడం లేదు. ఇలాంటి తరుణంలో గాజాలో పునర్నిర్మాణం, పరిపాలనను ప్రారంభించేందుకు అమెరికా మద్దతుగల ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ 6 నెలల కార్యాచరణ కోసం 2.45 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను ప్రతి­పాదిస్తోంది. బుధవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో బోర్డు సమావేశం నిర్వహించారు. గాజాలో అధిగమించాల్సిన భారీ అడ్డంకులు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు.

 అక్కడ పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ గవర్నర్లు 66 ప్రాజెక్టుల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్‌ 20 సూత్రాల ప్రణాళికకు మద్దతుగా రూపొందించిన ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య కార్యక్రమాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. గాజాలో దెబ్బతిన్న మౌలిక సదు­పాయాలు పూర్తిగా పునర్‌ నిర్మించడానికి సుమారు 35.2 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు, అలాగే తదుపరి 10 ఏళ్లలో మరో 71.4 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు ఖర్చ­వుతాయని ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement