ఎక్స్ వేదికగా ప్రకటించిన నేపియాన్ ఎంపీ ఆర్య
ఒట్టావా: భారత సంతతికి చెందిన మరో నేత కెనడా ప్రధాని రేసులో నిలిచారు. నేపియాన్ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య గురువారం ఈ మేరకు ప్రకటించారు. దేశ పునర్నిర్మాణం కోసం సమర్థమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమని వీడియో ప్రకటనలో ఉద్ఘాటించారు. ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి.
లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు.
ఈ ప్రయాణంలో అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో వైదొలిగిన నేపథ్యంలో ఆయన వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారడం తెలిసిందే. భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్‌తో పాటు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తదితర లిబరల్ పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
I am running to be the next Prime Minister of Canada to lead a small, more efficient government to rebuild our nation and secure prosperity for future generations.
We are facing significant structural problems that haven’t been seen for generations and solving them will require… pic.twitter.com/GJjJ1Y2oI5— Chandra Arya (@AryaCanada) January 9, 2025
కర్ణాటక టు కెనడా
కర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ ర్‌గా కెరీర్ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.
మార్చి 9న కొత్త ప్రధాని
కెనడా కొత్త ప్రధానిని, తమ నాయ కుడిని మార్చి 9న ప్రకటిస్తామని అధికా ర లిబరల్ పార్టీ గురువారం వెల్లడించింది. ఇందుకోసం దేశవ్యాప్త ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.
👉ఇదీ చదవండి : ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’
Comments
Please login to add a commentAdd a comment