జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్‌ | German tourist dances at festival before Hamas kidnap her | Sakshi
Sakshi News home page

జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్‌

Oct 10 2023 6:05 AM | Updated on Oct 10 2023 6:05 AM

German tourist dances at festival before Hamas kidnap her - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్‌ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్‌ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే.

‘‘శని క్రెడిట్‌ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్‌ సమీపంలో ఫెస్టివల్‌ ఆఫ్‌ పీస్‌ జరుగుతుండగా హమాస్‌ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement