రష్యా మాజీ రక్షణ మంత్రి ఇవనోవ్‌ కన్నుమూత  | Former Russian Defense Minister Sergei Ivanov passes away | Sakshi
Sakshi News home page

రష్యా మాజీ రక్షణ మంత్రి ఇవనోవ్‌ కన్నుమూత 

Jun 27 2026 4:39 AM | Updated on Jun 27 2026 4:39 AM

Former Russian Defense Minister Sergei Ivanov passes away

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వారసుడిగా గుర్తింపు పొందిన మాజీ రక్షణ మంత్రి సెర్గీ ఇవనోవ్‌(73) శుక్రవారం కన్నుమూశారు. అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఈ విషయం ప్రకటించింది. ఆయన మరణానికి కారణాలు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఒకప్పటి నిఘా సంస్థ కేజీబీలో తనతోపాటు పనిచేసిన సెర్గీ ఇవనోవ్‌ను అధ్యక్షుడు పుతిన్‌ 2001లో రక్షణ మంత్రిగా నియమించారు. రాజ్యాంగ నిబంధనల కారణంగా 2008లో వైదొలగాల్సిన సమయంలో పుతిన్‌ తన బాధ్యతలను ఇవనోవ్‌కే బాధ్యతలను అప్పగిస్తారని అంతా భావించారు. అయితే, అత్యాశాపరుడైన ఇవనోవ్‌ అధ్యక్ష పదవిని అట్టిపెట్టుకుని ఉంటారని పుతిన్‌ అనుమానించారని, అందుకే అప్పట్లో దిమిత్రీ మెద్వదెవ్‌కే బాధ్యతలిచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement