
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కో జీ(70)కి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. లిబియా నేత దివంగత కల్నల్ గడాఫీ నుంచి అక్రమంగా లక్షలా ది యూరోలను పొందేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలడంతో పారిస్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పుపై మాజీ అధ్యక్షుడు అప్పీలుకు వెళ్లినా జైలుకు వెళ్లక తప్పదని జడ్జి పేర్కొనడం గమనార్హం. లిబియాపై అప్పట్లో పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలను సడలించేందుకు సర్కోజీ సాయమందించడం, ప్రతిగా సర్కోజీ ఎన్నికల ప్రచారానికి గడాఫీ నిధులను సమకూర్చడం ఈ కుట్రలో కీలకంగా ఉన్నాయి. సర్కోజీ 2007–12 కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.