గాల్లో ఉండగా సడెన్‌గా డోర్‌ ఓపెన్‌.. ప్రముఖ సింగర్‌ టీమ్‌కు తప్పిన ప్రమాదం

Flight Door Opens Mid Air In Brazil Video Viral - Sakshi

బ్రెసీలియా: ఇటీవలి కాలంలో విమానం గాల్లో ఉన్న సమయాల్లో ఎమర్జెన్సీ డోర్‌లు ఓపెన్‌ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ విమానంలో ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్‌, సాంగ్‌ రైటర్‌తో పాటు వారి బ్యాండ్‌ బృందానికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం..  ఎన్‌హెచ్‌ఆర్ టాక్సీ ఏరియోకు చెందిన ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్‌(కార్గో డోర్‌) తెరుచుకుంది. దీంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. కాగా, ఈ విమానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. 

అయితే, మారన్ హావోలోని సావో లూయిస్‌లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో డోర్‌ ఓపెన్‌ కావడంతో వారంతా కంగారు పడ్డారు. వారి మ్యూజిక్‌ పరికరాలు చెడిపోతాయేమోనని టెన్షన్‌కు గురయ్యారు. అయితే, విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, విమాన సంస్థకు చెందిన అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్నొన్నాడు అలాగే, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రయాణికులు, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. 

ఇక, డోర్‌ తెరుచుకున్న సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు  స్పందిస్తూ ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్స్‌ చేయగా, భయకరంగా ఉందని మరో వ్యక్తి కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: విదేశీయులకు షాకిచ్చిన కువైట్‌..  66 వేల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top