జర్మనీలో కాల్పులు కలకలం.. ఐదుగురు పౌరులు మృతి | Five people dead in shooting in northern Germany | Sakshi
Sakshi News home page

జర్మనీలో కాల్పులు కలకలం.. ఐదుగురు పౌరులు మృతి

Jun 29 2026 6:55 PM | Updated on Jun 29 2026 7:00 PM

Five people dead in shooting in northern Germany

బెర్లిన్‌ : జర్మనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండుగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. ఏఎఫ్‌పీ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర జర్మనీలోని స్టేడ్ నగరంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.  

పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించే ప్రాంతం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు పట్టణ కేంద్రానికి వెలుపల పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని వదిలేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.  అమెరికాతో పోలిస్తే జర్మనీలో తుపాకీ నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. హాంబర్గ్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఈ స్టేడ్ పట్టణ జనాభా సుమారు 50,000 వరకు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement