పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా

First Indian Woman Sana who cleared the Pakistan public services exam In  First Attempt  - Sakshi

పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా రామ్‌చంద్‌ గుల్వానీ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ దేశ అత్యున్నత పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన తొలి  హిందూ మహిళగా సనా రామ్‌చంద్‌ గుల్వానీ చరిత్ర సృష్టించారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ పరిక్షలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలను అందుకున్నారు.

(చదవండి: స్పేస్‌ఎక్స్‌ టూరిజంలా త్వరలో మూన్‌ టూరిజం)

పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లోని సింధు గ్రామీణ్‌లో చోటు సంపాదించి సెంట్రల్‌ సూపిరియర్‌ సర్వీస్‌లో సనా స్థానం కైవసం చేసుకుంది. ఈ పరీక్ష భారత్‌లోని  సివిల్స్‌ పరీక్ష మాదిరి అత్యంత క్లిష్టమైన పరీక్ష. సనా.. షహీద్ మొహతర్మ బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత యూరాలజిస్ట్‌గా చదువును కొనసాగించారు. తదనంతరం ఫెడరల్‌ సర్వీస్‌ కమిషన్‌లో చేరారు.

(చదవండి: ఎలన్‌ మస్క్‌: రష్యాకు హ్యాండ్‌.. భారత్‌ కోసమేనా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top