శిలాజ ఇంధనాలపై పీటముడి.. కాప్‌ 31లో కుదరని ఏకాభిప్రాయం  | Fight over fossil fuels leaves COP31 climate talks in deadlock | Sakshi
Sakshi News home page

శిలాజ ఇంధనాలపై పీటముడి.. కాప్‌ 31లో కుదరని ఏకాభిప్రాయం 

Nov 23 2026 4:06 AM | Updated on Nov 23 2026 4:06 AM

Fight over fossil fuels leaves COP31 climate talks in deadlock

అంటాలియా: తుర్కియేలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు (కాప్‌ 31) ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. భూతాపానికి కారణమవుతున్న బొగ్గు, చమురు, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాల గురించిన ప్రస్తావన లేకపోవడాన్ని యూరప్‌ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో, ముఖ్య ప్రకటనపై అంగీకారం కుదరకుండానే గందరగోళం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. 

తీరప్రాంతం అంటాలియాలో రెండు వారాలుగా జరుగుతున్న ఈ చర్చలపై ముందునుంచే పెద్దగా అంచనాలు లేవు. అయితే, భూతాపానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను ఒప్పందంలో స్పష్టంగా చేర్చడం, ఆర్థిక సాయం వంటి ఇతర అంశాలపై దేశాల మధ్య అంగీకారం కుదరలేదు. అందుకే, కవర్‌ డెసిషన్‌ అని పిలుచుకునే ప్రధాన ఒప్పందం వెలువడలేదు. చిన్నపాటి అంశాలపై మాత్రం కొంత పురోగతి కనిపించింది. ఈ చర్చల్లో ఏ ఒప్పందం ఆమోదం పొందాలన్నా దాదాపు అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. 

శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండా తుర్కియే–ఆ్రస్టేలియా ఉమ్మడి నాయకత్వం రూపొందించిన తుది ప్రతిపాదనను ఆమోదించలేమని 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సహా పలు దేశాలు తేల్చి చెప్పాయి. ఒప్పంద పత్రంలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండా చేయడంలో రష్యా, సౌదీ అరేబియాలు ముందున్నాయి. ‘పెట్రోలియం, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల ప్రస్తావన లేని వాతావరణ ఒప్పందం అంటే అన్యాయమేనని తుర్కియేలోని అంటాలియాలో ఈయూ తరఫున పాల్గొన్న ఐర్లాండ్‌ వాతావరణ మంత్రి ఓబ్రియన్‌ పేర్కొన్నారు. ఈ చర్చల నుంచి అమెరికా ముందుగానే ఉపసంహరించుకుంది. ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చల మొదటి 25 ఏళ్లలో తుది ప్రకటనలో శిలాజ ఇంధనాల ప్రస్తావన స్పష్టంగా ఉండేది కాదు. కానీ, మూడేళ్ల క్రితం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్సో్ల జరిగిన కాప్‌ సదస్సులో ‘శిలాజ ఇంధనాల నుంచి దూరంగా ఉండాలి’అనే చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత జరిగిన చర్చల్లో శిలాజ ఇంధనాలపై స్పష్టమైన ప్రస్తావన రాకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement