భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్‌ హెచ్చరిక | "Somebody Is Finally Exposing Them...": Donald Trump Says India Charges Massive Tariffs On USA | Sakshi
Sakshi News home page

భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్‌ హెచ్చరిక

Published Sat, Mar 8 2025 8:33 AM | Last Updated on Sat, Mar 8 2025 9:18 AM

Donald Trump Says India charges Massive tariffs On USA

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ను టార్గెట్‌ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్‌ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్‌కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.

తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్‌ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్‌ వసూలు చేస్తోన్న టారిఫ్‌ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.

అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్‌ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.

అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా  వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్‌ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్‌ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇ‍క, ట్రంప్‌ సుంకాల ప్రకటన స్టాక్‌ మార్కెట్లను కుదిపేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement