‘కమల గెలిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయం’ | Donald Trump Protected By Bulletproof Glass first Outdoor Rally Since Shooting | Sakshi
Sakshi News home page

‘కమల గెలిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయం’

Aug 22 2024 7:29 AM | Updated on Aug 22 2024 9:14 AM

Donald Trump Protected By Bulletproof Glass first Outdoor Rally Since Shooting

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై హత్యాయత్నం జరిగిన అనంతరం తొలిసారి బహిరంగ సభలో బుల్లెట్‌ ప్రూఫ్ రక్షణ గ్లాస్‌ వెనక నుంచి మాట్లాడారు. నార్త్‌  కరోలినా  ఎన్నికల ర్యాలీలో పాల్గొన ట్రంప్‌ మరోసారి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుస్తే.. మూడో ప్రపంచ యుద్ధం రావటం ఖాయమన్నారు. 

ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ(ప్రజలు) జీవితకాలపు పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కమల అత్యంత ర్యాడికల్‌ భావాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆమె గెలిస్తే.. అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికిరాత్రే ఊడిపోతాయి.నేను మీకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాను చిన్నచూపు చూడన్విలేదు. ఆ విషయం మిగతా ప్రపంచదేశాధి నేతలకు కూడా తెలుసు. వచ్చే ఎ‍న్నికల్లో కామ్రేడ్‌ కమల గెలిస్తే మాత్రం.. మూడో ప్రపంచ యుద్ధం జరగట ఖాయం’అని అన్నారు. 

అదేవిధంగా ఒక్కసారి ట్రంప్‌ ప్రసంగం ఆపేసి డాక్టర్‌ను పిలిచారు. ర్యాలిలో పాల్గొన్న ఒకరు నీరంగా ఉండటం గమనించి ట్రంప్‌ వైద్యం సాయం అందించాలని అన్నారు. ‘‘ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను గమనించాను. చాలా మంది ప్రజలు ఇక్కడికి రావడానికి రోజుల తరబడి వేచి ఉన్నారు. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్‌ వారికి వైద్యసాయం అందించండి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement