క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు | Destruction In Tel Aviv after Iran Fires Missiles, Watch Video Inside | Sakshi
Sakshi News home page

క్షిపణులను తప్పించుకునేందుకు పరుగులు

Jun 22 2025 1:37 PM | Updated on Jun 22 2025 3:37 PM

Destruction in TelAviv after Iran Fires Missiles

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్ సైన్యంతో జతకట్టిన అమెరికా ఆర్మీ ఇస్లామిక్ దేశంలోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేసిన కొన్ని గంటలకే ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

ఈ వీడియోలలో టెల్ అవీవ్‌లో దట్టమైన పొగ  ఆవరించినట్లు కనిపిస్తోంది. వీధులు నిర్మానుష్యంగా ఉండటం, క్షిపణి వర్షం నుంచి తప్పించుకునేందుకు స్థానికులు పరుగెత్తడం మొదలైనవి కనిపిస్తున్నాయి.

ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం మధ్య ఇజ్రాయెల్‌లోని ఒక భవనం ఇరాన్ దాడికి గురైంది. బెన్ గురియన్ విమానాశ్రయంతో పాటు ఇతర ఇజ్రాయెల్ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఈ  దాడుల్లో 11 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపింది.

ఇస్లామిక్ రిపబ్లిక్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదంలో అమెరికా జోక్యం  దరిమిలా మిడిల్‌ఈస్ట్‌ అంతటా ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరాన్‌ తన అణుకార్యక్రమాన్ని ముగించకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు.

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ  తాము ఒక జట్టుగా పనిచేశామని, బహుశా ఇంతకు ముందు  ఎవరూ చేయనట్టుగా పనిచేశామన్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్‌ లీక్‌?

Advertisement
 
Advertisement
Advertisement