దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది | Chidimma Adetshina wins Miss Universe Nigeria 2024 | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది

Sep 3 2024 4:59 AM | Updated on Sep 3 2024 4:59 AM

Chidimma Adetshina wins Miss Universe Nigeria 2024

లాగోస్‌: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్‌ యూనివర్స్‌ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్‌లైన్‌లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్‌ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. 

నైజీరియా తండ్రి, మొజాంబిక్‌ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్‌ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement