ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మానవాళి అభివృద్ధికి తార్కానంగా నిలిచే ఈ సాంకేతిక కారణంగా మంచి ఎంత ఉందో.. చెడు అంతే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నైపుణ్య కార్మికుల జీవనోపాదిని ఏఐ పెద్దఎత్తున కొల్లగొడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర నివేదిక ప్రచురితమవుతుంది. మనిషిలో వ్యాధికి కారకాలైన ప్రమాదకరమైన పాథోజెన్లపై పరిశోధనకు సైంటిస్టులు ఏఐ సాయం కోరినట్లు నివేదికలో తేలింది.
జంతువులపై చికెన్ గున్యా వైరస్‌పై పరిశోధనకు ఏఐ వినియోగం జరిగిందని తెలుస్తోంది. అదేవిధంగా మిసైళ్లు, డ్రోన్లు, బాంబుల డిజైన్ల కోసం ఏఐ వాడుతున్నారని, ఇరాన్, రష్యా దేశాలకు చెందిన ముఠాలు తప్పుడు ప్రచారాల కోసం దీనిని వినియోగిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐ సామర్థ్యాలు పెరిగే కొద్ది బయో, సైబర్, సైనిక రంగాలకు ముప్పు పొంచి ఉందని దీంతో ఏఐ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిసెంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు ఏఐ ప్రమాదకర విషయాలను గుర్తించి అడ్డుకున్న ఘటనలపై ఆసంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇంజోసో ప్రభుత్వాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న సంస్థలు, సైబర్ నేరగాళ్లు, ప్రచార నెట్‌వర్క్‌లు, స్పైవేర్ విక్రేతలు, రాజకీయంగా ప్రేరేపిత వ్యక్తులు Claudeను దుర్వినియోగం చేసేందుకు చేసిన ప్రయత్నాలను వివరించింది. Claude Haiku, Sonnet, Opus మోడళ్లను ఉపయోగించిన ఈ ఘటనల్లో గూఢచర్యం, భారీ స్థాయి నిఘా, సైబర్ దాడులు, ఆయుధాల అభివృద్ధి, బయోవెపన్స్ పరిశోధన, తప్పుడు ప్రచారం, డేటా చోరీ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. జీవశాస్త్ర పరిశోధనలో ప్రత్యేకంగా ఆందోళనకరమైన కేసులు బయటపడ్డాయి.
ఒక శాస్త్రవేత్త చికున్‌గున్యా వైరస్‌ను జంతువుల్లో పదేపదే సంక్రమించేలా చేసి మరింత ప్రమాదకరంగా మార్చే gain-of-function పరిశోధనకు గ్రాంట్ దరఖాస్తు తయారు చేయమని కోరగా, ఆంత్రోపిక్ దాన్ని అడ్డుకుంది. అయితే వినియోగదారు మూడో పక్షం ద్వారా భద్రతా నియంత్రణను తప్పించుకున్నాడు. మరో సందర్భంలో Opus మోడల్‌ను ఉపయోగించి ఆర్థోపాక్స్ వైరస్‌ల రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే పరిశోధనకు సంబంధించిన గ్రాంట్ దరఖాస్తును రూపొందించారు.
ఆయుధాల తయారీ, సైనిక కార్యకలాపాల్లోనూ క్లౌడ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరిగాయని నివేదిక చెబుతోంది. చైనా, రష్యా, యెమెన్‌కు సంబంధించిన ఆరు కేసులను ఆంథ్రోపిక్ గుర్తించింది. యెమెన్‌లోని ఒక బృందం మానవ ఇంజినీర్లకు బదులుగా క్లౌడ్ కోడ్ సహాయంతో 2 వేల కిలోమీటర్లకు పైగా పరిధి లక్ష్యంగా పెట్టుకున్న బహుళ దశల బాలిస్టిక్ క్షిపణి, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసిందని పేర్కొంది. అయితే ఆ రాకెట్ పరీక్షించగా అది విఫలమైనట్లు సంస్థ తెలిపింది.
భారీ స్థాయి నిఘా, గూఢచర్యంలోనూ Claude వినియోగం కనిపించిందని సంస్థ పేర్కొంది. మొత్తం తొమ్మిది నిఘా కేసులను గుర్తించింది. చైనాతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఒక బృందం ఉయ్‌ఘర్ ప్రజలు, జర్నలిస్టులను ట్రాక్ చేసి వారి ప్రొఫైళ్లు రూపొందించేందుకు WhatsApp, Telegram నుంచి సేకరించిన డేటాను ఉపయోగించిందని..తప్పుడు సమాచార ప్రచారాలు, డేటా చోరీ, నకిలీ డేటింగ్ యాప్‌లు, ప్రత్యర్థి AI సంస్థల మోడల్-శిక్షణ కోసం Claudeను దుర్వినియోగం చేయడం వంటి ఘటనలను కూడా ఆంత్రోఫిక్ వెల్లడించింది. దీంతో ఏఐ వినియోగంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


