Australia Child-Snake Video: ‘ఛీ.. వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా?

Australia Crocodile Hunter 2 Year Old Son Drag Giant Snake in Viral Video - Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

మండిపడుతున్న నెటిజనులు

కాన్‌బెర్రా: సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక మనం ఏం చేసినా వెంటనే నలుగురికి తెలిసిపోతుంది. మంచిపని అయితే మనం అడక్కుండానే ప్రశంసలు దక్కుతాయి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలు కూడా అదే విధంగా వస్తాయి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నెటిజనులు ఏ మాత్రం మోహమాటపడరు. తాజాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఓ వీడియోపై నెటిజనులు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా.. అసలు మనిషివేనా అంటూ ఓ వ్యక్తిపై విరుకుపడుతున్నారు. ఆ వివరాలు..

ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్‌ వ్రైట్‌ గత 20 సంవత్సరాలుగా మొసళ్ల వేటగాడిగా పని చేస్తున్నాడు. జనారణ్యంలోకి వచ్చిన మొసళ్లను గుర్తించి.. తిరిగి వాటి నివాస స్థలానికి తరలిస్తాడు. ఈ క్రమంలో మ్యాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేశాడు. దీనిలో రెండేళ్ల చిన్నారి ఒకడు తన రెండు చేతులతో ఓ పెద్ద పాము తోకను పట్టుకుని లాగుతుంటాడు. ఈ దృశ్యం చూస్తే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వీడియోలో ఉన్న చిన్నారి మ్యాట్‌ కుమారుడు. దీనిలో తన కుమారుడిని ఉద్దేశించి.. ‘‘దాన్ని బయటకు లాగు చిన్నా. దాన్ని పొదల్లోకి పంపు’’ అంటూ మ్యాట్‌ అరవడం వినిపిస్తుంది. 
(చదవండి: కాలేజీ చదువు వదిలేసి.. రూ.660 కోట్ల భారీ మోసం)

ఇక ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు చిన్నారి సాహసాన్ని ప్రశంసిస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఛీ వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా.. ఆ పిల్లాడు చిన్నవాడు. పాము.. దాని నైజం గురించి వాడికి తెలియదు. కానీ నీ బుద్ధి ఏమైంది. పొరపాటున ఆ పాము నీ కొడుకును కాటేస్తే ఏంటి పరిస్థితి. అదేం బొమ్మ కాదు. వాడు లోకం తెలియని చిన్నారి.. అదేమో విచక్షణ లేని జీవి. ఎందుకు ఇలా నీ కుమారుడి జీవితంతో ఆడుకుంటున్నావ్‌.. పామును ఇలా హింసిచడం న్యాయమా’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: "యూ బ్లడీ ఫూల్‌" అంటూ.. మాట్లాడుతున్న బాతులు
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top