
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వరుల్ హక్ కకర్(52) సోమవారం పదవీ ప్రమాణం చేశారు. సోమవారం అధ్యక్ష భవనంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కకర్‌తో అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
మరికొద్ది నెలల్లో జరగాల్సిన నేషనల్ అసెంబ్లీ(దిగువసభ) ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడం, దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కకర్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు.