ప్రఖ్యాత ఆటోమెుబైల్ సంస్థ ఫోర్డ్ లో ఉద్యోగాల కొరత ఏర్పడినట్లు ఆ సంస్థ సీఈఓ జిమ్ ఫార్లీ పేర్కొన్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. ఫోర్డ్ సంస్థలో 5వేల మంది మెకానిక్ లు అవసరమున్న ఆనైపుణ్యం గల వ్యక్తులు లేరన్నారు. ఈ సమస్య కేవలం ఫోర్డు కంపెనీకి చెందింది మాత్రమే కాదని ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే తయారి రంగంలో అమెరికా వ్యాప్తంగా ఏర్పడ్డాయని జిమ్ ఫార్లీ పేర్కొన్నారు.
అమెరికాలో స్కిల్డ్ లేబర్స్ కొరత ఏర్పడినట్లు ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది. యూఎస్ స్కిల్డ్ లేబర్ మార్కెట్ లో పది లక్షలకు పైగా జాబులు ఖాళీగా ఉన్నాయని పలు నివేదికలు తెలుపుతున్నాయి. అత్యవసర సర్వీసులైన, ప్లంబర్స్, ఫ్యాక్టరీ వర్కర్స్, ఎలక్ట్రిషన్స్, ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీచేసే నిపుణుల కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బ్యురో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ఆగస్టు రిపోర్టు ప్రకారం కేవలం తయారిరంగంలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగిత రేటు 4.3 ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉద్యోగాల ఖాళీలు అధికంగా ఉన్నాయన్నారు.
ఫోర్డ్ కంపెనీ మెకానిక్ జాబులకు వార్షిక వేతనం లక్ష 20 వేల డాలర్లు ఇస్తుందని, ఈ ప్యాకెజీ అమెరిన్స్ తలసరి ఆదాయం కంటేఇది రెట్టింపని తెలిపారు. ఇంత మంచి ప్యాకెేజ్ ఉన్నప్పటికీ మెకానిక్ ల భర్తీ జరగడం లేదన్నారు. 2024లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో అవసరమున్న ఉద్యోగాలలో సగం మందిని నియమించుకోవడం చాలా కష్టమని ఒకవేళ వారి భర్తీ చేపట్టిన వారు ఎక్కువ కాలం ఈ జాబులలో ఉండడం లేదని సర్వే తెలిపిందని పేర్కొన్నారు. దేశ అధ్యక్షుడు ట్రంప్ తయారీరంగాన్ని అమెరికాకు తీసుకొస్తున్నానని ప్రకటిస్తున్నారని అయితే పరిస్థితులు చూస్తుంటే అమెరికన్స్ ఆ రంగంలో ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఫోర్ట్ సీఈఓ జిమ్ ఫర్లీ తెలిపినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది.


