సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా | America Donald Trump Govt backs down on tariffs | Sakshi
Sakshi News home page

సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా

Apr 10 2025 12:04 AM | Updated on Apr 10 2025 7:40 AM

America Donald Trump Govt backs down on tariffs

సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.

కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య  ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. ట్రంప్‌ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement