మోదీ వివాదాస్పద వ్యక్తి!: మస్క్‌తో కలిపి ఒకేగాటన కట్టిన చాట్‌జీపీటీ | AI Chatbot Mentions Narendra Modi On List Of Controversial People | Sakshi
Sakshi News home page

మోదీ వివాదాస్పద వ్యక్తి!: మస్క్‌తో కలిపి ఒకేగాటన కట్టిన చాట్‌జీపీటీ

Feb 21 2023 6:32 AM | Updated on Feb 21 2023 7:27 AM

AI Chatbot Mentions Narendra Modi On List Of Controversial People - Sakshi

న్యూయార్క్‌: ప్రధాని నరేంద్ర మోదీని ‘వివాదాస్పద వ్యక్తి’గా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ పేర్కొంది! ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ను ‘అత్యంత వివాదాస్పద వ్యక్తి’గా అది ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల్లో వివాదాస్పదుల జాబితాను చాట్‌జీపీటీ తాజాగా వెల్లడించింది.

అందులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో, బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితరులున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా చాట్‌జీపీటీ పేర్కొనడం విశేషం. వివాదాస్పదులు కాని వారి జాబితాలో అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్, మాక్రాన్, కుబేరులు బిల్‌ గేట్స్, జెఫ్‌ బెజోస్‌ తదితరులను పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement