త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కుషాయిగూడ: డీసీఎంను ఓవర్‌టేక్ చేయబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టడంతో వాహనానికి మంటలంటుకున్నాయి. ఈ సంఘటన గురువారం చర్లపల్లి పోలీస్‌ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన కరణ్ అనే యువకుడు చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను చర్లపల్లి వైపు వెళుతున్నాడు. అదే సమయంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న డీసీఎంను ఓవర్‌టేక్ చేసేక్రమంలో అదుపుతప్పి డీసీఎంను ఢీ కొట్టాడు. దీంతో అతను రోడ్డు పక్కన పడిపోగా బైక్ డీసీఎం వెనుక చక్రాల కింద ఇరుక్కుపోవడంతో మంటలంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డీసీఎం డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేయడంతో అందులో ఉన్న 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు కిందికి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. తీవ్రంగా గాయపడిన కరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. బైక్ డీసీఎం కింద ఇరుక్కుపోవడంతో పెట్రోల్ లీకై మంటలంటుకున్నట్లు గుర్తించారు. కాగా బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని, ప్రమాదం జరగగానే అతను అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
● డీసీఎంకు అంటుకున్న మంటలు..
● ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు..
● మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది...


