వృద్ధుడి చేతిలో బ్యాగ్ చోరీ
● రూ. 2.5లక్షల నగదు అపహరణ
కవాడిగూడ: బ్యాంకులో రూ.2.5 లక్షల నగదు డ్రా చేసుకుని కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వృద్ధుడి చేతిలో ఉన్న బ్యాగును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి లాక్కు,ని పరారైన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన వెంకటేశ్వరావుకు అశోక్ నగర్‌లోని ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుత యూనియన్) బ్యాంక్‌లో ఖాతా ఉంది. గురువారం ఉదయం రోడ్డుపై కారు పార్క్ చేసి బ్యాంక్ వచ్చాడు. బ్యాంకులో రూ. 2 .50 లక్షలు డ్రా చేశాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నగదు భద్రపరచుకుని కారు వద్దకు నడిచి వెళుతుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అతడి చేతితో ఉన్న బ్యాగ్ లాక్కెళ్లాడు. బాధితుడు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా దారి దోపిడీ కేసు నమోదు చేసిన దోమలగూడ డీఐ సుధాకర్ రావు క్రైం సిబ్బందితో రంగంలోకి వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకులో ఉదయం నుంచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.


