యువకుడి దారుణ హత్య
డబీర్‌పురా: ఓ యువకుడి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పురా రేతికీ మసీదు ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ యూసుఫ్ కుమారుడు షేక్ జూనైద్ బిన్ మహ్మద్ ఆలియాస్ జూనైద్ బర్మాస్ (35)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని యువకులు కత్తులతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రెయిన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాకుత్‌పురా రహమత్‌నగర్‌కు చెందిన ఉమర్ బిన్ హంజా అల్ జాబ్రీ, అలీ బిన్ హంజా అల్ జాబ్రీ, రహీం గోరి, ఫైసల్ బిన్ మహ్మద్, మలిక్ బిన్ జావీద్ అల్ జాబ్రీలపై అనుమారనం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.


