​​​​​​​సీవీ ఆనంద్‌ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలు | CV Anand Fake Facebook accounts | Sakshi
Sakshi News home page

​​​​​​​సీవీ ఆనంద్‌ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలు

Jan 30 2024 6:04 AM | Updated on Jan 30 2024 7:47 AM

CV Anand Fake Facebook accounts - Sakshi

హిమాయత్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ పేరిట సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ కావడంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు సీవీ ఆనంద్‌ పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌లో ఫేక్‌ అకౌంట్‌లు ఓపెన్‌ చేసి..పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీవీ ఆనంద్‌ దృష్టికి వచ్చింది. ఆయన సూచన మేరకు ఏసీబీ అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శివ మారుతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement