పోలీసు వ్యవస్థను బ‌లోపేతం చేసేలా.. | Regional Police Coordination Committee meeting Latest Update | Sakshi
Sakshi News home page

23న రీజినల్‌ పోలీస్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ భేటీ

Oct 21 2026 1:46 PM | Updated on Oct 21 2026 2:16 PM

Regional Police Coordination Committee meeting Latest Update

ఆర్‌పీసీసీ భేటీపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ స‌మీక్ష‌

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ (ఆర్‌పీసీసీ–రీజినల్‌ పోలీస్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ) సమావేశ నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసు శాఖ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ఇటీవలే సీనియర్‌ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఇతర సీనియర్‌ పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రాంతీయంగా పోలీసు శాఖలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించనున్నారు.

మత్తుపదార్థాల రవాణాతోపాటు, సైబర్‌ నేరాల్లో అంతర్రాష్ట్ర ముఠాలే ఎక్కువ చిక్కుతుండడంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యంగా ఉండనుంది.

ఇదీ చ‌ద‌వండి: పల్లె జేబుకు ధరల చిల్లు!

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు డిసెంబర్‌లో తిరుపతిలో నిర్వహించనున్న 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సుకు కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయిలో చర్చించేందుకు ఈ సదస్సు వేదిక కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement