సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Oct 21 2023 4:44 AM | Updated on Oct 21 2023 7:35 AM

- - Sakshi

అనంత్‌కుమార్‌ (ఫైల్‌)

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కామల్ల రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌ కళ్యాణ్‌నగర్‌కు చెందిన అనంత్‌కుమార్‌(44) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.

శుక్రవారం ఉదయం 11 గంటలైనా భర్త బెడ్‌ రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి భార్య అరుణ కిటికీలోంచి చూడగా అనంత్‌ తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి అనంత్‌ను కిందకు దించి, చూడగా అప్పటికే ఆయన మృతి చెందాడు. బోరబండ పీఎస్‌ సెక్టార్‌ ఎస్‌ఐ స్వప్నారెడ్డి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement