సాక్షిప్రతినిధి, వరంగల్‌ : | - | Sakshi
Sakshi News home page

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

– 8లోu

పార్టీలు మారే సంస్కృతి మీది

రుగల్లు కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. ఈసారి పరకాల కేంద్రంగా రాజుకున్న చిచ్చు.. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి వరకు తాకింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్సెస్‌ మంత్రి కొండా సురేఖ కుటుంబంగా సాగుతున్న రాజకీయ పోరు సీఎం పర్యటన తర్వాత మరింత ముదిరింది. సురేఖ కుమార్తె సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ సంఘం మంత్రి సురేఖకు నోటీసులు ఇవ్వడం.. దానికి ఆమె ఇచ్చిన వివరణ.. తాజాగా కొండా వ్యతిరేకవర్గం నేతలు మీడియా ముందుకొచ్చి ఆమైపె చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ నేతలను డిమాండ్‌ చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. చివరికి ఢిల్లీ పెద్దల వరకు ఫిర్యాదులు చేరాయి.

సీఎం పర్యటన తర్వాత వివాదం..

సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..

ఈ నెల 17న పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ప్రశంసిస్తూ, రాబోయే ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. ఈపర్యటనకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తాను పిలిచినా సీఎం సభకు మంత్రి రాలేదని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఈసందర్భంగా బుధవారం గీసుకొండలో కొండా సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రేవూరిపై ఆమె వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వచ్చినా, రేవూరి వచ్చినా పరకాలనుంచి తానే అభ్యర్థినని ఆమె ప్రకటించింది. దీంతో దుమారం రేపిన సుస్మిత వ్యాఖ్యలపై దృష్టి సారించింది. ఈ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి సురేఖ వివరణ తీరుపై భగ్గు..

టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవికి గురువారం వివరణతో కూడిన లేఖను అందజేసిన మంత్రి కొండా సురేఖ.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని.. వాటిని తనకు ఆపాదించడం తగదని స్పష్టం చేశారు. బంధుత్వం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొక రు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ఏర్పా టు చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రెండు జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్‌ తదితరులు కొండా సురేఖ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేయడం కలకలంగా మారింది.

అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ..

ఇటీవలి పరిణామాలు చూస్తే.. కొండా సురేఖ కుటుంబం వర్సెస్‌ ఒక్క రేవూరి వ్యవహారం కాదని స్పష్టమవుతోంది. సురేఖ వివరణ, పార్టీ కీలక నేతల తాజా డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సుస్మిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటా రా? సురేఖకు ఇచ్చిన నోటీసుపై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? కొండా వ్యతిరేకవర్గం రీ–యూనియన్‌ నేతలు డిమాండ్లు ఏ మేరకు పరిష్కరించుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు ఏవిధమైన మలుపులు తిరగనున్నాయి? అన్న చర్చ ఇటు రాజకీయ విశ్లేషకులు, అటు పార్టీ కేడర్‌లో సాగుతోంది.

పీక్స్‌కు చేరిన ఓరుగల్లు కాంగ్రెస్‌ పంచాయితీ

రేవూరి వర్సెస్‌ కొండా..

పరకాల టికెట్‌పై మొదలైన రగడ

సుస్మిత వ్యాఖ్యలతో రగిలిన చిచ్చు.. మంత్రి సురేఖకు క్రమశిక్షణ నోటీసు

‘ఆమె వ్యక్తిగతం.. నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’ అంటూ సురేఖ వివరణ

‘కొండా’ వ్యతిరేక శిబిరం రీ–యూనియన్‌.. మంత్రిపై చర్యలకు డిమాండ్‌

సయోధ్య కుదిరిన కొద్ది నెలల్లోనే

విభేదాలు బహిరంగం

పదవులు అనుభవిస్తూ

పార్టీని నిర్వీర్యం చేస్తారా?

కొండా సురేఖ కూతురు సుస్మితపై

కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహం

పాత విభేదాలకు కొత్త మలుపు..

కొండా సురేఖ కుటుంబానికి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలకు మధ్య గతంలోనూ విభేదాలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు తదితర నేతలు గతంలో కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ, కుటుంబం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డిలకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ సందర్భంలోనూ కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి లేఖ ద్వారా తన వివరణ ఇచ్చింది. ఏఐసీసీ, టీపీసీసీ నేతలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో కొండా సురేఖతోపాటు రేవూరి, కడియం, నాగరాజు, బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఒకే వేదికపై కనిపించారు. అందరూ కలిసి నాయిని రాజేందర్‌రెడ్డి నివాసంలో విందు భోజనంలో పాల్గొనడం కూడా అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా పరకాల కేంద్రంగా భగ్గుమన్న విబేధాల సెగ హైదరాబాద్‌, ఢిల్లీ వరకు తాకడం కాంగ్రెస్‌లో ‘కలిసి నడుద్దాం’ అనుకున్న కొద్ది నెలలకే.. ‘ఎవరికి వారే’ అన్న పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement