విలీన దడ! | - | Sakshi
Sakshi News home page

విలీన దడ!

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

విలీన దడ!

ములుగు జంక్షన్‌లో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు

బీఆర్‌ఎస్‌ మద్దతు..

‘శక్తి’ నుంచి పాలిటెక్నిక్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పాలిటిక్నిక్‌ విద్యార్థులు, వివిధ సంఘాల నాయకుల చేపట్టిన నిరసన ర్యాలీకి బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో మాజీ ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, నాయకులు మద్దతు ప్రకటించి, ములుగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

వరంగల్‌ అర్బన్‌: పాలిటెక్నిక్‌ కాలేజీలను స్కిల్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్షియేటివ్స్‌(శక్తి)లో విలీనం చేయాలనే ప్రభుత్వ జీఓ జారీపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. భవిష్యత్‌పై భయందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి వారం రో జులుగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నిరసనకు అధ్యాపకులు, సిబ్బంది సైతం కదం తొక్కారు. ఇదిలా ఉండగా.. గురువా రం సాయంత్రం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అయినప్పటికీ అధ్యాపకులు, విద్యార్థుల్లో నమ్మకం కలగడం లేదనే వాదనలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది..

తెలంగాణ వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు పా లిటెక్నిక్‌ విద్యను అభ్యసిస్తుండగా, వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 10 వేల మంది జాయిన్‌ అవుతున్నారు. పదోతరగతి పూర్తయిన వారు పాలిటెక్నిక్‌లోని 28 కోర్సుల్లో జాయిన్‌ అవుతున్నారు. జిల్లాలోని వరంగల్‌లో బాలుర, బాలిక కళాశాలల్లో సుమారు 2,500 మంది, స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాల, కాటారం, మహబూబాబాద్‌లో మిగిలిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌కు

పరిమితం చేయడమేనా?

ప్రభుత్వం ఇటీవల శక్తి స్కీమ్‌ను తీసుకొస్తూ పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేస్తూ జారీ చేసిన జీఓ 97 దుమారం రేపుతోంది. పాలిటెక్నిక్‌ విద్యార్థుల మూడేళ్ల పాటు పడ్డ శ్రమ అంతా వృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన విద్యను పీపీపీ మోడల్‌లో నడిచే వర్సిటీకి అప్పగిస్తే భవిష్యత్‌లో ఫీజుల భారం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేకనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులను ప్రైవేట్‌ వర్సిటీల వైపు నెట్టేస్తున్నారని మదన పడుతున్నారు. గతంలో మూడేళ్ల పాలిటెక్నిక్‌ విద్య పూర్తి కాగానే ఇంజనీరింగ్‌ సెకండియర్‌ (లేటర్‌ విద్య)లోకి ప్రవేశించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విలీనం వల్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులను స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌కు పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థులు భావిస్తున్నారు.

స్కిల్‌ వర్సిటీలో ‘పాలిటెక్నిక్‌’ విలీనంపై భయాందోళన

మూడేళ్ల విద్య వృథా అవుతుందని

రోడ్డెక్కిన విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement