వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నీట్ పీజీ–2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అవసరమైన సమాచారాన్ని అభ్యర్థులకు అందించాలని, పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.


