కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు జరగుతున్నాయని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కేయూ 50 వసంతాలతో గోల్డెన్‌జూబ్లీ, ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాంపస్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ సైన్సెస్, ఆర్డ్స్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు సమాజ అవసరాలు, సామాజిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించేలా ఉన్నాయన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.140 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు, కేయూకు రూ.400 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కేయూ ఆవిర్భావం తర్వాతి ప్రొఫెసర్లు, ఉద్యోగులు తమ అంకితభావంతో వర్సిటీకి బలమైన పునాదాలు వేశారన్నారు. వారి స్ఫూర్తిని నేటితరం అధ్యాపకులు, ఉద్యోగులు కొనసాగించాలని ఆయన సూచించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్‌లాల్, డాక్టర్ రమ, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ సుకుమారి తదితరులున్నారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
గోల్డెన్ జూబ్లీ, వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం


