విద్యార్థులకు అవగాహన,
విక్రేతలపై కఠినచర్యలు
పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం.
– పి. రమేశ్‌కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్


