హన్మకొండ కల్చరల్: శ్రావణంలోని మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు దేవాలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. వేయిస్తంభాల ఆలయంలో ఇష్టకామేశ్వరిగా రుద్రున్ని అలంకరించి పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి చీర, సారె, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరీ దేవాలయం, సంతోషిమాత ఆలయం, పద్మాక్షి దేవాలయం, ఎకై ్సజ్ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.


