● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులు వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాజీపేటలో కొనసాగుతున్న ఆర్‌ఓబీ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేశ్‌బాబు ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పురోగతిని ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనుల వివరాలు కలెక్టర్‌కు వివరించారు. ఈఈ దేవిక, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


