హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహ నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ర్యాలీలో కాంగ్రెస్ టీపీసీసీ, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన
వరంగల్ చౌరస్తా: మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీ ప్రసిడెంట్ అయూబ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి అర్ధనగ్న ప్రదర్శనగా కాశిబు గ్గ జంక్షన్‌కు చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
అంబేడ్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ


