కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా శ్రీనివాస్‌రావు | - | Sakshi
Sakshi News home page

కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా శ్రీనివాస్‌రావు

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతిగా శ్రీనివాస్‌రావు అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా రామచంద్రం నాణ్యమైన విద్య అందించాలి బాల పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

కేయూ క్యాంపస్‌: కేయూలోని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ఎం విభా గాధిపతిగా ఆ విభాగం ప్రొఫెసర్‌ పి.శ్రీనివాస్‌రా వును నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ.శ్రీనివాసులు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావును నియమించారు. గతంలో శ్రీనివాస్‌రావు కేయూ డిసేబుల్డ్‌ సెల్‌ డైరెక్టర్‌, అడ్మిషన్ల డైరెక్టరేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌, యూనివర్సిటీ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ, హాస్టళ్ల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆవిభాగాధిపతిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చిలువేరు రాజ్‌కుమార్‌ ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇకనుంచి రిజిస్ట్రార్‌ రామచంద్రం అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ధ్రువీకరించారు.

విద్యారణ్యపురి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ హైస్కూల్‌లో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్‌ సెంటర్‌ టీచింగ్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఏఐ టూల్స్‌ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్‌వీ.గిరిరాజ్‌గౌడ్‌, ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఎంఈఓ నెహ్రూ, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ బండారు మన్‌మోహన్‌, రిసోర్స్‌పర్సన్లు, సోషల్‌ స్టడీస్‌ టీచర్లు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికిఅందించనున్న రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఎఫ్‌ఏసీ అధికారి విశ్వజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు ఆన్‌లైన్‌ల్‌లో awards.gov.in వెబ్‌సైట్‌లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రామన్నపేట: ఇంటింటి జ్వర సర్వే సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు, డ్రై డే నిర్వహణ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. మంగళవారం పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌. టి.మదన్‌మోహన్‌రావుతో కలిసి డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా క్లినిక్‌ను సందర్శించి మెప్మా రిసోర్స్‌పర్సన్లు ఆరోగ్య సిబ్బంది మహిళా క్లినిక్‌ సేవలపై మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం లష్కర్‌ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, వైద్యాదికారి హైదర్‌, సబ్‌ యూనిట్‌ అఽధికారి ఖాదర్‌ అబ్బాస్‌, సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement