ఆటపాటలతోనే అభ్యాసానికి బాట | - | Sakshi
Sakshi News home page

ఆటపాటలతోనే అభ్యాసానికి బాట

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

ఆటపాటలతోనే అభ్యాసానికి బాట

కాళోజీ సెంటర్‌/ఖిలా వరంగల్‌: చిన్నారులకు ఆటపాటలు, కథల ద్వారా బోధన చేస్తేనే నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి సమగ్ర వికాసం సాధ్యమవుతుందని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. కరీమాబాద్‌ పాఠశాలలోని ప్రీప్రైమరీ విభాగంతో పాటు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీమాబాద్‌ ప్రీప్రైమరీ తరగతి గదిలో చిన్నారులకు ‘ప్లే వే మెథడ్‌’ బోధన, బోధన అభ్యాస సామగ్రి వినియోగం, పిల్ల ల భాగస్వామ్యాన్ని కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులతో రైమ్స్‌ చెప్పిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కరీమాబాద్‌, శంభునిపేట జీహెచ్‌ఎస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్‌ తేజ, ఉల్లాస్‌ కో–ఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావు, హెచ్‌ఎం జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్‌ఓలకు సహకరించాలి

ఖిలా వరంగల్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్‌ నగరంలోని లెనిన్‌నగర్‌, రంగశాయిపేట ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. ఎస్‌ఐఆర్‌ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. బూత్‌ లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓలు) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ పరిశీలనలో తహసీల్దార్‌ ఇక్బాల్‌, ఎంసీపీఐ నగర ప్రధాన కార్యదర్శి సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement