తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’

మల్హర్‌: తాడిచర్ల–2 కోల్‌బ్లాక్‌ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్‌బ్లాక్‌ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ బ్లాక్‌ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్‌ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, నాయకులు సునీల్‌రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ని షిధర్‌రెడ్డి, మల్క మోహన్‌రావు, శ్రీకాంత్‌ ఉన్నారు.

కోల్‌బ్లాక్‌ ద్వారా

రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్‌

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి

జి.కిషన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement