నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్ జోష్
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో
రూ.48.73 కోట్ల
మద్యం అమ్మకాలు
● ఆబ్కారీశాఖకు
కాసుల పంట..
రికార్డు బ్రేక్ చేసిన
మద్యం ప్రియులు
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆబ్కారీశాఖ కాసుల పంట పండింది. 2025 డిసెంబర్ 31కి వీడ్కోలు పలికి.. 2026 జనవరి 1కి మందుబాబులు స్వాగతం పలికి రికార్డు స్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉ న్నాయి. సంతోషంతో మందు కొడుతూ నూ తన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హనుమకొండ జిల్లాలో రూ.16.40 కోట్ల మద్యం, ఉమ్మడి జిల్లాలో రూ.48.73 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, రిసార్టుల్లో..
నూతన సంవత్సర వేడుకలను ఓరుగల్లు వాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ కేక్‌లకు ఎంత క్రేజ్ ఉందో అంతకు మించి మద్యానికి ఉండడం కనిపించింది. ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, రిసార్టుల్లో ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఈవెంట్స్‌కు రూ.9 వేల నుంచి రూ.50 వేల వరకు రుసుము చెల్లించడంతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం సమకూరింది.
ఉమ్మడి జిల్లాలో
295 వైన్స్, 134 బార్లు..
ఉమ్మడి జిల్లాలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మందుబాబులు చీర్స్ కొడుతూ రూ.48.73 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. కాగా, 2024లో రూ.39.50 కోట్లు, 2025లో రికార్డు బ్రేక్ చేస్తూ రూ. 48.73 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
హనుమకొండ జిల్లాలో మద్యం విక్రయాల వివరాలు..
సంవత్సరం విక్రయాలు
2023 రూ.6 కోట్లు
2024 రూ.14.7 కోట్లు
2025 రూ.16.40 కోట్లు


