ఉద్యోగుల అత్యుత్తమ సేవలతోనే ఉత్తమ డివిజన్‌గా ఎంపిక...
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల అత్యుత్తమ సేవలతోనే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఉత్తమ డివిజన్‌లలో హనుమకొండ టౌన్ మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. సరఫరా మెరుగుకు అవసరమైన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. డివిజన్‌లో అగ్రస్థానంలో నిలిపిన డివిజన్‌లోని ఉద్యోగులు, అధికారులకు అభినందనలు.
– టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి
●


