జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
న్యూశాయంపేట: 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యశారద కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, టవల్స్ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్ పెన్నులు, వాటర్ బాటిల్స్, పూల బొకేలు అందజేస్తూ కలెక్టర్ సత్య శారదకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టీజీఓ, టీఎన్జీఓ, ట్రస్సా యూనియన్ల క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, టీఎన్జీఓ ప్రెసిడెంట్ బోనాల కిషన్, ఆర్డీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణి కుమార్, కలెక్టరేట్ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్రెసా బాధ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.
టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి..
జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే టెట్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. టెట్ నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సంపేట సమీపంలోని బిట్స్ కళాశాల, వరంగల్ నగరంలో గోపాలస్వామి గుడి సమీపంలోని ఎన్‌ఎస్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 1,400 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి..
ఖిలా వరంగల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో వరంగల్ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను ఆర్టీఓ శోభన్‌బాబుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్, జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబు, ఇంజనీర్ రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, ఆర్టీసీ డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్య శారద


