సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్‌ తొలగిస్తాం | - | Sakshi
Sakshi News home page

సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్‌ తొలగిస్తాం

Jan 2 2026 12:23 PM | Updated on Jan 2 2026 12:23 PM

సత్ప్

సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్‌ తొలగిస్తాం

భూ నిర్వాసితులు, నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీ షీట్‌ నుంచి పేరు తొలగిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. న్యూ ఇయర్‌ సందర్భంగా గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కమిషనరేట్‌ పరిధిలోని రౌడీ షీటర్లతోపాటు అనుమానుతులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను అందజేశారు.సత్ప్రవర్తన తో జీవిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించిన 19 మందిలో 5 గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, ఒకరు కేడీ, ఒకరు డీసీని రౌడీ షీట్ల నుంచి పేర్లను తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు అందజేశారు. ప్ర స్తుతం ఎలాంటి జీవితం గడుపుతున్నారని రౌడీ షీ టర్లను తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పా ల్పడడంతో మీపై రౌడీ షీట్లను ఓపెన్‌ చేశామని, ప్ర స్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం షీట్లను తొలగించామని, భవిష్యత్‌లో ఇలాగే జీవించాలన్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్రనాయక్‌, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజు, ఇ న్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, సంజీవ్‌ పాల్గొన్నారు.

ముగిసిన క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈస్ట్‌జోన్‌ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల లీగ్‌మ్యాచ్‌లు ముగిశాయి. గురువారం వరంగల్‌, సూర్యాపేట జట్లు తలపడగా వరంగల్‌ సాధించింది. ఈ క్రికెట్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హనుమకొండ రోహిణి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ రామ్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాగా, నేడు సెమిఫైనల్‌ మ్యాచ్‌లలో హనుమకొండ, కొత్తగూడె– భద్రాద్రి, పెద్దపల్లి –ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఆరెండు జట్లలో గెలిచిన జట్లు ఈనెల 3న ఫైనల్‌లో తలపడుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఫైనాన్స్‌ అకౌంట్‌ ఆఫీసర్‌

మధుసూదన్‌పై ఫిర్యాదు

డీటీఎఫ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ

లింగారెడ్డి

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో డిప్యుటేషన్‌పై, జయశంకర్‌ భూపాలపల్లి డీఈఓ ఆఫీస్‌లో ఫైనాన్స్‌ అకౌంట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్‌ అవకతవకలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌కు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు హనుమకొండకు చెందిన డెమొక్రటిక్‌ టీచర్స్‌ఫెడరేషన్‌ ( డీటీఎఫ్‌) రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ టి. లింగారెడ్డి గురువారం తెలిపారు. విచారణ జరిపించి ఆ అధికారిని ఈ రెండు జిల్లాల బాధ్యతల నుంచి తొలగించి అతడి మాతృశాఖకు పంపాలని డైరెక్టర్‌ను కోరామన్నారు. విచారణ జరిపించి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి న్యాయం చేయాలని దక్షిణ మధ్య రైల్వే పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కాజీపేట బ్రాంచ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉమ్మడి పోరాటానికి గురువారం కాజీపేట రైల్వే పెన్షనర్స్‌ కార్యాలయంలో వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షనర్స్‌ సంఘం అధ్యక్షుడు కందుల సంగమయ్య మాట్లాడుతూ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కావాలని 1979 నుంచి 1983 వరకు పోరాటం చేసిన దివంగత బి.ఆర్‌.భగవాన్‌దాస్‌, దివంగత మడత కాళిదాస్‌ కళ నెరవేరబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు కోచ్‌ఫ్యాక్టరీలో ఉద్యోగా వకాశాలు ఇస్తేనే వారికి నిజమైన నివాళుల ర్పించినట్లు అన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, రైల్వే కా ర్మిక పిల్లలు, యాక్ట్‌ అంప్రెంటీస్‌ చేసిన వారికి ప్ర త్యేక జీఓ తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. పెన్షనర్స్‌ సంఘం కోశాధికారి కె.ఐలయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యాదయ్య, వైస్‌ ప్రెసిడెంట్లు రాములు, వెంకటేశ్వ ర్లు, పాల్గొన్నారు.

సత్ప్రవర్తనతో జీవిస్తే  రౌడీషీట్‌ తొలగిస్తాం
1
1/2

సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్‌ తొలగిస్తాం

సత్ప్రవర్తనతో జీవిస్తే  రౌడీషీట్‌ తొలగిస్తాం
2
2/2

సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్‌ తొలగిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement