విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యతలో రాజీలేదు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని, ఈ క్రమంలో స్తంభాల తయారీ నాణ్యతలో రాజీపడేది లేదని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మే నేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ పున్నేలు రోడ్ లోని స్వర్ణ, ఉజ్వల స్తంభాల తయారీ కేంద్రంతోపాటు యాదా ద్రి భువనగిరి జిల్లా గూడూరులోని మంచుకొండ స్తంభాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో తయారీ ప్రక్రియ, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైఫరీత్యాలు, భారీ ఈదురు గాలులు వీచిన సమయంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పా టించాలన్నారు. తయారీదారులు ఎలాంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ కె.తిరుమల్, ఎస్‌ఈ (సివిల్) వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఓటాయి ప్రాంతంలో
పులి సంచారం
● తోడు కోసం జిల్లాలు దాటి
తిరుగుతున్న టైగర్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఓటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు బుధవారం పులి ఆనవాళ్లు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి.. అక్కడ నుంచి తోడు కోసం వెతుకుతూ ఓటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో పులి ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పులి అడవి మొత్తం తిరగడం సహజమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పులి.. ఓటాయి అటవీ ప్రాంతంలో ఆరు నెలల క్రితం జంగవానిగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దుక్కిటెద్దును చంపింది. మళ్లీ రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలోని వాగులో పులి పాదముద్రలు గుర్తించి న పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికా రులకు సమాచారం అందించగా వారు వెళ్లి పాదముద్రలు సేకరించారు. వీటి ఆధారంగా ఆడపులి అయి ఉండొచ్చనే అంచనాకు వ చ్చినట్లు సమాచారం. కాగా, సమీప గ్రామా ల రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యతలో రాజీలేదు


